Realme 14T: "రియల్‌మీ 14T" స్మార్ట్‌ఫోన్‌తో.. 12.5 గంటల పాటు నాన్-స్టఫ్ గేమింగ్ అనుభవం.! 10 month ago
రియల్‌మీ సంస్థ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ అయిన "Realme 14T 5G" ని భారతీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ ఏప్రిల్ 25న భారత మార్కెట్లోకి రాబోతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ అద్భుతమైన డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీ, మంచి కెమెరా మరియు అదిరిపోయే డిజైన్‌తో మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక బలమైన పోటీదారుగా నిలవనుంది. విడుదలైన తర్వాత.. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వేదికలైన ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర మరియు ఇతర ముఖ్యమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.!
Realme 14T ఫీచర్లు:
డిస్‌ప్లే: 6.67 అంగుళాలు AMOLED బెజెల్-లెస్ డిస్‌ప్లే
రిఫ్రెష్ రేటు: 120 Hz
పీక్ బ్రైట్నెస్: 2100 nits
బ్యాక్ కెమెరా: 50 MP AI మెయిన్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 16 MP
బ్యాటరీ: 6000 mAh
ఛార్జింగ్: 45W ఫాస్ట్ ఛార్జింగ్
ప్రాసెసర్: MediaTek Dimensity 6300
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15
8 GB RAM + 128 GB స్టోరేజ్
కనెక్టివిటీ ఫీచర్లు:
- 5G, 4G సింగిల్ సిమ్
- బ్లూటూత్ v5.1
- USB టైప్-C
సెన్సార్లు: ఇన్-డిస్‌ప్లే - ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్
కలర్ ఆప్షన్స్:
- సిల్కెన్ గ్రీన్
- వైలెట్ గ్రేస్
- శాటిన్ ఇంక్
ప్లస్ పాయింట్స్:
- IP69 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్
- 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్
- 111% DCI-P3 వైడ్ కలర్ గమట్ సపోర్ట్
- 50 MP AI కెమెరా
Realme 14T మొబైల్ గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అందిన లీక్స్ ప్రకారం దీని ధర రూ.17,999 నుండి ప్రారంభం కావచ్చని తెలుస్తుంది. ఈ ఫోన్ మిగతా వేరియెంట్స్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. లాంచ్ చేసిన తరువాత సేల్ వివరాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతానికి ఆ ధరలో ఒకటి..రెండు తప్ప చెప్పుకునే విధంగా ఫీచర్లు ఏమి ఆకట్టుకునే లాగా లేవు. కానీ కంపెనీ మాత్రం మధ్య-శ్రేణి విభాగంలో ఇది సంచలనం సృష్టిస్తుందని తెలిపింది. లాంగ్ లైఫ్ బ్యాటరీ కారణంగా 17 గంటల నాన్-స్టాప్ యూట్యూబ్ ప్లేబ్యాక్.. 12.5 గంటల గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ విడుదల అయ్యాక పూర్తి అవగాహనకు రావాలి.
ఇది చదవండి: భారత మార్కెట్లోకి రానున్న ఒప్పో కొత్త ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ తో "ఒప్పో K13 5G"